BCCI : క్రికెట్ అనే కాదు పలు ఆటల్లో కొందరు ఆటగాళ్ల వయసుపై వివాదాలు తలెత్తడం చూశాం. ఐపీఎల్ 18 వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కూడా ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు అండర్ -16 ఆటగాళ్లను తదుపరి సీజన్లో వయసు పైబడిందనే కారణంతో అనుమతించడం లేదు. దాంతో, ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై జూనియర్ స్థాయిలో ఏ క్రికెటర్ కూడా వయసును కప్పిపుచ్చకుండా వైద్యపరీక్షలను కఠినతరం చేసింది. ఇప్పటివరకూ 14-16 ఏళ్ల అబ్బాయిలకే బోన్ టెస్ట్ (Bone Test) జరిపేవారు. ఈ పరీక్షలో నిర్దారణ అయిన వయసుకు ఒక ఏడాదిని కలిపేవారు. అంటే.. ఉదహరణకు ఒక ఆటగాడి వయసు 14.3 సంవత్సరాలు అనుకోండి.. బీసీసీఐ ప్రకారం అతడికి 15.3 సంవత్సరాలు ఉన్నట్టుగా పరిగణిస్తారు. దీన్నే మ్యాథమేటికల్ ఏజ్ అని పిలుస్తారు.
జూనియర్ స్థాయిలో ఆటగాళ్ల ఎంపిక సమయంలో బోన్ టెస్టు చేస్తారు. ఈ పరీక్షలో వారి వయసును పక్కాగా లెక్కించడం సాధ్యమవుతుంది. అయితే..ఈ ఏడాది అండర్ -16 టీమ్‌లో ఆడిన వాళ్లు తదుపరి సీజన్ సమయానికి వయసు 17క చేరడంతో అనర్హతకు గురవుతున్నారు. అందుకు.. ఇకపై వీళ్లకు సెకండ్ బోన్ టెస్టు జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టెస్ట్‌ను 16 ఏళ్లున్న అబ్బాయిలకు, 15 ఏళ్లున్న అమ్మాయిలకు నిర్వహిస్తామని తెలిపింది.
వైభవ్ సూర్యవంశీ
ఎముకల సాంద్రత, పరిమాణం వంటివి నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ ఉంటే వాళ్లను పక్కనపెట్టాలని బోర్డు సెలెక్టర్లకు సూచించనుంది. అందుకే కానీ, దాంతో, భవిష్యత్‌లో ఏజ్ ఫ్రాడ్ అనే విషయమే తెరపైకి రాదని బీసీసీఐ భావిస్తోంది. తద్వారా అండర్ -16 ఆటగాళ్లకు రెండోసారి బోన్ టెస్ట్ చేయడం ద్వారా వాళ్ల వయసును తెలుసుకొని.. టోర్నీలో ఆడేందుకు అవకాశం కల్పించనుంది. మామూలుగా ప్రతిసారి దేశవాళీ సీజన్ ప్రారంభం ముందు అందరికీ ఎక్స్- రే ద్వారా ఏజ్ టెస్టు నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి 40-50 మంది అబ్బాయిలకు, 20-25 మంది అమ్మాయిలకు ఈ టెస్టు నిర్వహిస్తారు.