Raghavapur | పెద్దపల్లి రూరల్, జూన్ 20 : పేరు ప్రతిష్టలున్న తనపై బురదజల్లి నిందారోపణల పాలు చేయాలన్న ప్రయత్నంలో భాగమే పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ శివారులోని 5.28 ఎకరంల భూమి కొనుగోలు వ్వవహారమని రాఘవాపూర్ సర్పంచ్ ఆడేపు వెంకటేశం అన్నారు. జిల్లా కలెక్టరేట్ ముందు మా భూమిని రాఘవాపూర్ మాజీ సర్పంచ్ కబ్జా చేసి అక్రమంగా కొనుగోలు చేశాడని తల్లి కొడుకులు, గ్రామస్తులు , చేసిన ఆరోపణలపై స్పందించిన మాజీ సర్పంచ్ వెంకటేష్ బాధిత భూమిని అమ్మిన వ్యక్తితో కలిసి రాఘవాపూర్ లోని నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను భూములకబ్జాకోరును కాదని ఎవరికైనా ఏ ఆపద వచ్చినా తాను అప్పులు తీసుకోచ్చుకుని అవసరాలు తీర్చుకున్నట్లే వారికి సహాయసహకారాలు అందిస్తానని అలాంటిది సబ్బితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య భార్య సుశీల, వారి కొడుకు శంకరయ్యల మధ్య ఉన్న వివాదాలతో తనకు ఎలాంటి సంబంధలేదన్నారు.
కేవలం వాళ్ల ఇంటి అసరాలు, కూతురు పెళ్లికి వారి కుటుంబ అవసరాలకు కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారని, వాటిని చెల్లించమంటే శంకరయ్య తన వద్ద డబ్బు లేదని భూమి మాత్రమే ఉందని అది అమ్ముతానని చెప్పడంతో పెద్దమనుషుల సమాచారం మేరకు మరింత డబ్బు చెల్లించి భూమిని తీసుకున్నానని చెప్పారు. అనవసరంగా తన ప్రతిష్టకు భంగం కలిగించే వారి విషయంలో కఠినంగానే వ్యవహరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ రాజు శంకరయ్య, మాజీ ఎంపీటీసీ తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చుంచు సదయ్య, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.