BCCI : భారత జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ వేటను ప్రారంభమైంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు అహ్వానించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జెర్సీ స్పాన్సర్షిప్ ధరల్లో మార్పులు చేసింది. ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ నియంత్రణ చట్టం కారణంగా డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు చేసుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సిరీస్లకు.. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలకు విడిగా ధరను నిర్ణయించింది. మొత్తంగా వచ్చే మూడేళ్లలో రూ.400 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఉందని సమాచారం.
ప్రస్తుతం భారత జట్టు జెర్సీ స్పాన్సర్షిప్ ధరలు.. ద్వైపాక్షిక సిరీస్లో రూ.3.17 కోట్లు, ప్రపంచ కప్ వంటి మ్యాచ్లకు రూ.1.12 కోట్లుగా ఉన్నాయి. అయితే.. డ్రీమ్ 11తో ఒప్పందం అనూహ్యంగా రద్దు చేసుకోవాల్సి రావడంతో బీసీసీఐ ధరల్లో మార్పులు చేసింది. ఇకపై నుంచి రెండు దేశాల టోర్నీలో జెర్సీ స్పాన్సర్షిప్ ధర రూ.3.5 కోట్లు, పలు దేశాలు పోటీపడే వరల్డ్ కప్ వంటి టోర్నీలకు రూ.1.5 కోట్లు చెల్లించాలనే నిబంధన పెట్టింది. ఉన్నట్టుండి జెర్సీ స్పాన్సర్షిప్ ధరల పెంపు నిర్ణయానికి కారణాలు ఉన్నాయి.
🚨 𝐁𝐂𝐂𝐈 sets *𝐧𝐞𝐰* base price for jersey sponsorship:
💰 INR 𝟑.𝟓𝟎 𝐂𝐫/𝐛𝐢𝐥𝐚𝐭𝐞𝐫𝐚𝐥 𝐦𝐚𝐭𝐜𝐡 and 𝐈𝐍𝐑 𝟏.𝟓 𝐜𝐫𝐨𝐫𝐞/𝐦𝐮𝐥𝐭𝐢𝐥𝐚𝐭𝐞𝐫𝐚𝐥 𝐦𝐚𝐭𝐜𝐡 (ICC/ACC competitions)
💰 BCCI is said to be seeking sponsorship for the 𝐧𝐞𝐱𝐭 𝐭𝐡𝐫𝐞𝐞 𝐲𝐞𝐚𝐫𝐬 pic.twitter.com/ECKIqpf0s4
— Cricbuzz (@cricbuzz) September 5, 2025
ద్వైపాక్షిక సిరీస్లు అనుకోండి.. స్పాన్సర్ పేరు జెర్సీ ముందు భాగంలో ఉంటుంది. ఆ సిరీస్ ఆసాంతం పలుమార్లు స్పాన్సర్ కంపనీ పేరు కనపిస్తుంది. అదే వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో స్పాన్సర్ పేరు జెర్సీ చేతుల మీద మాత్రమే ఉంటుంది. దాంతో, పేరు స్పష్టంగా.. తరచుగా కనిపించే అవకాశాలు తక్కువ. కాబట్టి.. ధరలను నిర్ణయించే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
NEWS 🚨 – BCCI announces the release of the Invitation for Expression of Interest for National Team Lead Sponsor Rights
More details here 👇https://t.co/Qx6YZvYWrw pic.twitter.com/0e0vCoIdBT
— BCCI (@BCCI) September 2, 2025
వచ్చే మూడేళ్లలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో కలిపి 130 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. సో.. ఈ కాలంలో కొత్త స్పాన్సర్ ద్వారా రూ.400 కోట్ల ఆదాయం బీసీసీఐ ఖజానాకు చేరనుంది. టీమిండియా జెర్సీ స్పాన్సర్ కోసం సెప్టెంబర్ 16వ తేదీలోపు బిడ్డింగ్లు వేయాలని ప్రకటన విడుదల చేసిన విషయ తెలిసిందే.