దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025ని గెలుచుకున్న టీమిండియా జట్టుపై బీసీసీఐ ప్రశంసలు కురిపించింది. భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని, ఆ హోదాలోనే విజేతగా నిలిచిందని, వన్డేలు.. టీ20ల్లో ఇండియా టాప్ ర్యాంక్ జట్టుగా కొనసాగుతున్నట్లు బీసీసీఐ ఇవాళ తన ప్రకటనలో పేర్కొన్నది. రోహిత్ సేన అత్యద్భుత ప్రదర్శన ఇచ్చిందని, అన్ని సవాళ్లను ఎదుర్కొన్నదని, నిర్భయంగా.. క్రమశిక్షణతో టోర్నీలో విజేతగా నిలిచినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రపంచ టోర్నీల్లో విజయకాంక్షతో భారత్ దూసుకెళ్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇండియా తన సత్తా చాటినట్లు బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసిన ప్రకటనలో తెలిపింది. చరిత్రాత్మక విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రను బీసీసీఐ విశేషంగా కొనియాడింది. రోహిత్లోని అసాధారణ నాయకత్వ లక్షణాలు.. జట్టును గెలుపుబాటలో నిలపడంలో సక్సెస్ అయ్యిందని ప్రకటనలో తెలిపారు. రోహిత్ నేతృత్వంలో ఇండియా రెండోసారి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకున్నదని బీసీసీఐ తెలిపింది. 2024 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2025 చాంపియన్స్ ట్రోఫీ విజయంతో.. రోహిత్ ఓ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యారని పేర్కొన్నది.
ప్రధాన కోచ్ గౌతం గంభీర్ పాత్రను కూడా బీసీసీఐ మెచ్చుకున్నది. గంభీర్ సాహసోపేత విధానం, వ్యూహాలు.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నది. భారత క్రికెట్లో ఈ విజయం ఓ మైలురాయి అని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తెలిపారు. వత్తిడిలో జట్టు ఆడిన తీరు అద్భుతమని బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఐసీసీ టైటిల్‌ను గెలవడం ఎప్పటికీ ప్రత్యేకమే అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. అత్యద్భుత నైపుణ్యాన్ని, ఐక్యతను జట్టు చాటిందని బీసీసీఐ ట్రెజరర్ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా తెలిపారు.
BCCI hails Team India’s unbeaten run to ICC Champions Trophy 2025 glory 🏆 🙌#TeamIndia | #ChampionsTrophy | Details 🔽
— BCCI (@BCCI) March 10, 2025
ఇక ఫైనల్లో అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజాకు.. ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ మెడల్ దక్కింది. జట్టు ఫిజియో ఆ మెడల్‌ను అందజేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన కార్యక్రమంలో .. బెస్ట్ ఫీల్డర్ మెడల్ బహూకరించారు.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵 | #Final
For one final time in the #ChampionsTrophy 🏆
The winner of the fielding medal goes to 🥁
WATCH 🎥🔽 #TeamIndia | #INDvNZ
— BCCI (@BCCI) March 10, 2025