నోయిడా: అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య నోయిడా వేదికగా జరగాల్సి ఉన్న ఏకైక టెస్టు మూడో రోజూ ఒక్క బంతి కూడా పడకుండానే రైద్దెంది. తొలి రెండు రోజులు ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో రైద్దెన మ్యాచ్.. మూడో రోజు వర్షం కారణంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్లో ఇంతవరకూ టాస్ సైతం పడకపోవడం గమనార్హం. వర్షం నుంచి మైదానాన్ని పూర్తిగా కప్పిఉంచేలా అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ) నుంచి ప్రత్యేకంగా కవర్లు తెప్పించినా కొన్ని ప్రదేశాలలో నీరు ఇంకే ఉంది. అదీగాక రాబోయే రెండు రోజుల్లో నోయిడాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ సాగడం అనుమానంగానే ఉంది. ఒకవేళ వరుణుడు సహకరించి ఆట సాగితే మాత్రం చివరి రెండు రోజులూ 98 ఓవర్ల పాటు మ్యాచ్ను నిర్వహిస్తామని అంపైర్లు తెలిపారు.