IPL | ముంబై : ఐపీఎల్లో కెప్టెన్లు స్లో ఓవర్ రేట్లకు బలవుతుంటే మితిమీరి నియమావళిని ఉల్లంఘిస్తున్న ఆటగాళ్లపై ఐపీఎల్ పాలకమండలి ‘ఫైన్’ కొరడాలను ఝుళిపిస్తోంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో వివాదాస్పద నిర్ణయంతో ఔట్ అయిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
దీంతో అతడు ఐపీఎల్ నియమావళి ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు గాను కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. పంజాబ్ కెప్టెన్ కరన్ పైనా 50 శాతం కోత విధించారు.