Digvesh Singh | ముంబై : లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్‌కు బీసీసీఐ షాకిచ్చింది. మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు.. కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్‌ను ఔట్ చేయగానే అతడి వద్దకు వెళ్లి పెన్ను పేపర్‌తో ఏదో రాసినట్టుగా ‘నోట్‌బుక్ సెలెబ్రేషన్’ చేసుకున్నాడు. ఇందుకు గాను లెవల్-1 తప్పిదం కింద దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది.