Shreyas Iyer : కీలకమైన రెండో టెస్టుకు ముందు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉంటాడా? లేదా అనే సందిగ్ధానికి తెరపడింది. ఈ స్టార్ క్రికెటర్ రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడని బీసీసీఐ తెలిపింది. ఈరోజు సాయంత్రం ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘వెన్నునొప్పితో గాయపడుతున్న శ్రేయస్ అయ్యర్ జాతీయ క్రికెట్ అకాడమీలో విజయవంతంగా రిహబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు.
అయ్యర్‌కు పరీక్షలు నిర్వహించిన బీసీసీఐ వైద్య బృందం అతను ఫిట్‌గా ఉన్నాడని సర్టిఫికెట్ ఇచ్చింది. రెండో టెస్టుకు అతను జట్టులో కలవనున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో రెండో టెస్టు జరగనుంది’ అని బీసీసీఐ ట్వీట్లో తెలిపింది.
అయ్యర్ ఫిట్నెస్ సాధించడంతో సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అవుతాడా? ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. సిరీస్ గెలిచేందుకు కీలకమైన రెండో టెస్టులో ఎవరు ఆడతారు? అనేది ఆసక్తికరంగా మారింది. రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీలో ప్రారంభం కానుంది.
రెండో టెస్టుకు భారత బృందంః రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్.
నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై జడేజా, అశ్విన్ ఆస్ట్రేలియా బ్యాటర్లను కంగారెత్తించారు. దాంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 177కు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 400 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. జడేజా, అక్షర్ పటేల్ అర్థ శతకాలతో భారీ స్కోర్‌కు బాటలు వేశారు. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ, అశ్విన్ మళ్లీ చెలరేగారు. స్పిన్ మాంత్రికుడు అశ్విన్ ఒకే సెషన్లో ఐదు వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. 91 రన్స్‌కే ఆలౌట్ అయింది. దాంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
🚨 NEWS 🚨: Shreyas Iyer to join India squad for Delhi Test. #TeamIndia | #INDvAUS
Details 🔽https://t.co/0KtDRJYhvg
— BCCI (@BCCI) February 14, 2023