న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీని భారత్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన రోహిత్ సేనకు.. బీసీసీఐ( BCCI) భారీ నగదు నజరానా ప్రకటించింది. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన భారత క్రికెటర్లకు 58 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. క్యాష్ ప్రైజ్ అందుకునేవారిలో క్రికెటర్లతో పాటు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీ సభ్యులు ఉంటారు.
రోహిత్ శర్మ నేతృత్వంలో ఇండియన్ జట్టు.. పాక్ ఆతిథ్యం ఇచ్చిన చాంపియన్స్ ట్రోఫీలో డామినేట్ చేసినట్లు బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఫైనల్లో ప్రవేశించేందుకు టీమిండియా వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసింది. బంగ్లాదేశ్‌పై తొలి గ్రూపు మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. గ్రూపు చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 44 రన్స్ తేడాతో గెలిచింది. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది.
ఐసీసీ టైటిళ్లను వరుసగా గెలవడం ప్రత్యేకమైందని, అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా అంకితభావానికి, ఉత్తమ ఆటతీరుకు క్యాష్ రివార్డు సంకేతమని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తెలిపారు. ప్రతి ఒక్కరి కష్టానికి నగదు నజరానా గుర్తింపు వంటిదన్నారు. 2025లో ఇది రెండో ఐసీసీ ట్రోఫీ అన్నారు. అండర్19 వుమెన్స్ వరల్డ్‌కప్ గెలిచినట్లు చెప్పారు.
🚨 NEWS 🚨
BCCI Announces Cash Prize for India’s victorious ICC Champions Trophy 2025 contingent.
Details 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/si5V9RFFgX
— BCCI (@BCCI) March 20, 2025
క్యాష్ రివార్డు కింద ప్రతి ప్లేయర్‌కు 3 కోట్లు, హెడ్ కోచ్‌కు 3 కోట్లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు 50 లక్షలు దక్కనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.