మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 4 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ 3-3 మహిళా, పురుషుల టోర్నీ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. కాగా రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు 20 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు 50 మంది అఫీషియల్స్ పాల్గొన్నారు.