Kohli – Rohit : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు వడోదరలో వినూత్న సన్మానం జరిగింది. సరికొత్తగా ఆలోచించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ ‘రో-కో’ను ‘ఔట్ ఆఫ్ ది బాక్స్’ స్వాగతంతో ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ బాక్స్ లోంచి బయటకు వచ్చి.. పూలగుత్తులను స్వీకరించారు. అనంతరం తమ నిలువెత్తు ఫొటోగ్రాఫ్ మీద విరాట్, హిట్‌మ్యాన్ సంతకాలు చేశారు. ఇది ఇద్దరికి వీడ్కోలు మ్యాచ్ కూడా కాదు. మరి బరోడా క్రికెట్ సంఘం (Baroda Cricket Association) ఇంత హంగామా ఎందుకు చేసిందో తెలుసా..?
వడోదరలోని స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ వన్డేనే మొట్టమొదటి అంతర్జాతీయ 50 ఓవర్ల మ్యాచ్. అందుకని ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మలచాలనుకున్న బరోడా క్రికెట్ సంఘం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఘనంగా సన్మానించింది. ఆదివారం భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఈ లెజెండరీ ఆటగాళ్లకు బోర్డు సభ్యులు ఔట్ ఆఫ్ ది బాక్స్ సత్కారం చేశారు.
— BCCI (@BCCI) January 11, 2026
బాక్స్ నుంచి బయటకొచ్చిన ఇరువురికి పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం అదే బాక్స్ కప్బోర్డ్పై తమ నిలువెత్తు ఫొటోలపై కోహ్లీ, రోహిత్ సంతకం చేశారు. రో-కోను, స్టేడియంలోని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసేలా జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఈ సర్ప్రైజింగ్ ఈవెంట్ ఫొటోలను బీసీసీఐ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే అభిమానులు మాత్రం ఇదేమీ రోహిత్, విరాట్‌కు వీడ్కోలు మ్యాచ్ కాదుగా.. ఎందుకింత హడావిడి అని కామెంట్లు పెడుతున్నారు.
— BCCI (@BCCI) January 11, 2026
— BCCI (@BCCI) January 11, 2026