దంబుల్లా: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో బంగ్లా 83 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో లంక 15.2 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది.
రిషాద్ హుస్సేన్ (3/18), షరీఫుల్ ఇస్లాం(2/12), సైఫుద్దీన్ (2/21) ధాటికి లంక బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. నిస్సనక (32), దసున్ శనక(20) ఆకట్టుకు న్నారు. అంతకుముందు కెప్టెన్ లిటన్‌దాస్ (76), షమీమ్ హుస్సేన్ (48) రాణించడంతో బంగ్లా 20 ఓవర్లలో 177/7 స్కోరు చేసింది. ఫెర్నాండో(3/31) రాణించాడు.