ఢాకా: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ప్లేయర్లు ఘర్షణ(Cricket Fight) పడ్డారు. ఢాకాలో రెండు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. మైదానంలోనే ఇద్దరు ప్లేయర్లు గొడవకు దిగారు. బంగ్లా బ్యాటర్ రిపన్ మోండల్‌పై .. సౌతాఫ్రికా పేస్ బౌలర్ షిపో నులి చేయిచేసుకున్నాడు. పిచ్‌పై వాగ్వాదానికి దిగారు. బంగ్లా బ్యాటర్‌కు సఫారీ బౌలర్ పంచ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్‌తో పాటు మిగితా ఆటగాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బంగ్లా బ్యాటర్‌పై మరో దక్షిణాఫ్రికా ఫీల్డర్ దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆటగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మ్యాచ్ అధికారులు త్వరలో రిపోర్టును సమర్పించనున్నారు.
ఓ క్రికెట్ వెబ్సైట్ ప్రకారం.. నులి బౌలింగ్‌లో స్ట్రెయిట్ సిక్సర్ కొట్టాడు రిపన్. దీంతో ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు చూపులు విసురుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ పార్ట్నర్, నాన్ స్ట్రయికర్ వద్దకు బ్యాటర్ వెళ్లాడు. ఆ సమయంలో బంగ్లా బ్యాటర్ మీదకు సౌతాఫ్రికా బౌలర్ దూసుకువచ్చాడు. ఏదో మాటలు అనుకుని, ఒకర్ని ఒకరు తోసేసుకున్నారు. ఆ తర్వాత ఆ గొడవ పెద్దగా మారింది. బ్యాటర్ రిపన్ హెల్మెట్‌ను బౌలర్ నులి లాగేశాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది.
I have never seen such an incident in the history of cricket. A direct fight. What a shameful incident of cricket happened between the talented bowler Shepo Ntuli of South Africa and Ripon Mondal of Bangladesh. This is extreme. #BANevsSAe #CricketTwitter #Bangladesh #SouthAfrica pic.twitter.com/3CbMTHwUEA
— Monirul Ibna Rabjal 🇧🇩🇪🇺 (@to2monirul) May 28, 2025