ఢిల్లీ: భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడేందుకు తమ జట్టును ఆ దేశానికి పంపబోమని మంకు పట్టు పట్టి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ షూటర్లను మాత్రం ఇక్కడ ఆడేందుకు అనుమతినిచ్చింది. వచ్చే నెల 2 నుంచి 14 మధ్య ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో జరగాల్సి ఉన్న ఆసియా రైఫిల్ అండ్ పిస్టోల్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు గాను బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు రైఫిల్ షూటర్లు భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) కూడా ధృవీకరించింది. కాగా, క్రికెటర్లను పంపడానికి భద్రతా కారణాలను చూపిన ఆ దేశ ప్రభుత్వం.. షూటర్లను పంపేందుకు అంగీకరించడంతో బంగ్లాదేశ్ ద్వంద్వ విధానాలను అనుసరిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.