ODI World Cup | వన్డే ప్రపంచ కప్-2023 టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ ముంగిట బంగ్లాదేశ్ 246 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. బౌలింగ్‌కు అనుకూలంగా పిచ్ ఉండటంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. రెండో వికెట్ భాగస్వామ్యానికి మెహిందీ హొసన్ శాంతో 30, తన్జిత్ హసన్ 16 పరుగులతో స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. రెండో వికెట్ కు 40 పరుగులు జత చేసిన తర్వాత తన్జిద్ హసన్.. మెహిందీ హొసన్ శాంతో ఔట్ కావడంతో బంగ్లాదేశ్ కష్టాల్లో చిక్కుకున్నది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ షాకీబ్ అల్ హసన్‌తో ముష్పీకర్ రహీమ్.. ఐదో వికెట్ భాగస్వామ్యానికి 50 పరుగులు జోడించాడు.
ముషీఫర్ రహీమ్ 66 పరుగులు, సారధి షాకీబ్ అల్ హసన్ 40 పరుగులతో పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ ముగిసే సమయానికి మహ్మదుల్లా 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు మాత్రమే కోల్పోయి బంగ్లాదేశ్ 245 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు లుకీ ఫెర్గూసన్ మూడు, ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ రెండేసీ వికెట్లు, మిచెల్ శాంత్నర్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు.