దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరగనున్న వన్డే(BANvIND)లో.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్, స్పిన్నర్ వరున్ చక్రవర్తిని తుది జట్టుకు ఎంపిక చేయలేదు. హర్షిత్ రాణా, షమీలు పేస్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. ఒకవేళ టాస్ గెలిస్తే, ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని రోహిత్ పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లో సెకండ్ బ్యాటింగ్ ఈజీగా ఉంటుందని పేర్కొన్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చేశాడు.
Our Playing XI for #BANvIND 👊
Updates ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia |#ChampionsTrophy pic.twitter.com/pKwRfCt2MR
— BCCI (@BCCI) February 20, 2025
ఈ మ్యాచ్‌కు ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా బరిలోకి దిగుతున్నది. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. బౌలింగ్ లైనప్‌లో ఉన్నారు. జడేజా, అక్షర్ ఆల్‌రౌండర్లు కాగా, కుల్దీప్ తన మణికట్టుతో మాయ చేయనున్నాడు. ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో .. బంగ్లాదేశ్ ఆడుతోంది. నహిద్ రాణాకు బదులుగా తంజిమ్ హసన్‌ను జట్టులోకి తీసుకున్నారు.