Bangladesh Fan : క్రికెట్ అనేది ఒక ఆట మాత్రేమే కాదు భావోద్వేగాలతో ముడిపడిన క్రీడ. అందుకే.. గెలుపు ఓటములు మమూలేనని తెలిసినా సరే.. చిన్న జట్ల చేతిలో ఓడిపోతే మాత్రం అభిమానులు తట్టుకోలేరు. మీకు ఆడడం చేతకాదా? అని ఆగ్రహావేశాలతో రగిలిపోతారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఇదే పరిస్థితి ఎదురైంది. అఫ్గనిస్థాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు భగ్గుమన్నారు. బంగ్లా ఆటగాళ్లు ఢాకా విమానాశ్రయం చేరుకోగానే వాళ్లపై తిట్ల దండకం మొదలెట్టిన ఫ్యాన్స్ అంతటితో ఊరుకోకుండా క్రికెటర్ల వాహనాలను ధ్వంసం చేశారు.
అభిమానుల ఆగ్రహాశాలను ఊహించని బంగ్లా క్రికెటర్లు షాకయ్యారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ మొహమ్మద్ నయీం షేక్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అందులో తమను అర్ధం చేసుకోవాలని ఆవేదనను వ్యక్తం చేశాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారి క్రికెట్ మాత్రమే ఆడం. మనదేశం పేరును ఛాతిమీద సగర్వంగా మోస్తాం. ఎరుపు, ఆకుపచ్చ రంగుల మన జాతీయ జెండా మా శరీరంపైనే కాదు మా రక్తంలోనూ ఉంటుంది. ప్రతి బంతికి, ప్రతి పరుగుకు.. మా ప్రతి శ్వాసలోనూ.. దేశం గర్వపడేలా చేయాలనకుంటాం. అయితే.. కొన్ని సార్లు గెలుస్తాం. కొన్నిసార్లు ఓడిపోతాం. జయాపజయాలు వస్తూ పోతుంటాయి. ఇది క్రీడల్లో మామూలే. మేము ఓడినప్పుడు మీరు బాధపడుతారని, కోప్పడుతారని మాకు తెలుసు.
ఎందుకంటే మాలెక్కనే మీరు కూడా దేశాన్ని ఎంతో ప్రేమిస్తారు. అయితే.. మీరు మమల్ని ఈ రోజు ద్వేషించిన తీరు, మా వాహనాలను ధ్వంసం చేయండం నిజంగా ఎంతో బాధించింది. మేమూ మనుషులమే. మేమూ పొరపాట్లు చేస్తాం. అలాగనీ మాకు దేశంపై ప్రేమలేదని కాదు. ప్రతిక్షణం దేశంకోసం, ఇక్కడి ప్రజల కోసం.. మీ అందరి ముఖాల్లో నవ్వులు చూడడం కోసం ఎంతో శ్రమిస్తాం. అందుకే.. మాకు మీ ప్రేమ కావాలి. ద్వేషం కాదు. విమర్శలకు ఒక కారణం ఉంటుంది. కానీ, కోపానికి కాదు. మన జాతీయ జెండా మనందరి గర్వానికి ప్రతీక కావాలి. అంతేతప్ప ఆగ్రహానికి కాదు అని ఫేస్బుక్లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు.
I Condemn Such Behaviour. Fans Gave Bad Slogans To Bangladesh Cricketers At Airport After They Reached In Dhaka.
I Understand Things Like 3-0 Is Sad, But This Can Happen. Such Slogans Wont Help #AFGvBaN pic.twitter.com/R6VJDfiOvH
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) October 16, 2025
ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మెహిదీ హసన్ మిరాజ్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది అఫ్గనిస్థాన్. తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన బంగ్లా.. ఆ తర్వాత వరుసగా 81 పరుగులు, 200ల తేడాతో ఓటమి చవిచూసింది. కాబూలీ టీమ్ చేతిలో పరాజయాన్ని బంగ్లా అభిమానులు లైట్‌గా తీసుకోలేకపోయారు. ఆసియా కప్‌లోనూ పాకిస్థాన్‌పై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడడం కూడా అభిమానుల ఆగ్రహానికి ఆజ్యం పోసి ఉంటుంది.