ఢాకా: స్వదేశంలో పాకిస్థాన్‌తో రెండు టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి మొదలైన తొలిటెస్టులో మొదటి రోజే బంగ్లాదేశ్ పటిష్టస్థితిలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది.
కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (101) శతకంతో కదం తొక్కగా మోమినుల్ హక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ (48 బ్యాటింగ్), లిటన్ దాస్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.