సిల్హెట్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది. లెఫ్మార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (6/120) కెరీర్లో 18వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో మంగళవారం ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగా 78 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. పాక్‌పై బంగాకు ఇది వరుసగా రెండో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్ కావడం విశేషం.
437 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 316/7తో ఐదో రోజు ఆట కొనసాగించిన పాక్13 బంతుల వ్యవధిలో చివరి 3 వికెట్లను కోల్పోయింది. ఫలితంగా 358 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మహ్మద్ రిజ్వాన్ (94) ఒంటరి పోరాటం చేశాడు. సాజిద్ ఖాన్ (28)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 54 పరుగులు జోడించి ఆశలు రేపినా.. తైజుల్ ఇస్లాం ఈ జోడీని విడదీసి మ్యాచ్‌ను గెలిపించాడు. లిటన్ దాస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, ముష్ఫికర్ రహీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు.