ఛత్తోగ్రమ్ : స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను దక్కించుకున్న జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌నూ విజయంతో ఆరంభించింది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో బంగ్లా.. 6 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మొదట న్యూజిలాండ్.. క్లార్క్ (51), క్లెవర్ (51) అర్ధ శతకాలతో 20 ఓవర్లకు 182/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో తౌహిద్ హృదయ్ (27 బంతుల్లో 51 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆటకు తోడు షమీమ్ హోసేన్ (31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
శాంట్నర్ ఔట్
ముంబై: ఐపీఎల్-19లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ భుజం గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే వాంఖెడేలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టబోతూ అతడు గాయపడ్డాడు. శాంట్నర్ స్థానంలో ముంబై.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను జట్టులోకి తీసుకుంది.