Bangladesh | రావల్పిండి: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లా.. ఆతిథ్య జట్టుకు దీటైన జవాబిచ్చింది. ముష్ఫీకర్ రహీమ్ (191) తృటిలో ద్విశతకాన్ని కోల్పోగా మెహిది హసన్ మిరాజ్ (77) రాణించడంతో ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 117 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆటలో లిటన్ దాస్ (56) త్వరగానే నిష్క్రమించినా మిరాజ్‌తో ఏడో వికెట్‌కు 196 పరుగులు జోడించిన ముష్ఫీకర్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
రావల్పిండి పిచ్‌పై షహీన్ అఫ్రిది (2/88), నసీమ్ షా (3/93) వంటి స్టార్ పేసర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 పరుగులు చేసిన విషయం విదితమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సయీమ్ అయూబ్ (1) వికెట్‌ను కోల్పోయి 23 పరుగులు చేసింది. ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలుండటంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం.