ఢాకా: భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు బంగ్లాదేశ్(Bangladesh) జట్టును ప్రకటించింది. గాయపడ్డ షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ జకీర్ అలీని ఎంపిక చేశారు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ షోరిఫుల్ రెండు మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. గత నెలలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు సమయంలో.. అతనికి గజ్జల్లో నొప్పి వచ్చింది. పాక్‌కు వెళ్లిన 16 మంది బృందంలో.. ఒక్క షోరిఫుల్ మాత్రమే మిస్ అవుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆ సిరీస్‌లో 2-0 తేడాతో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.
Bangladesh Test Squad for the India Tour 2024#BCB #Cricket #BDCricket #Bangladesh #INDvsBAN pic.twitter.com/1npeXGgkix
— Bangladesh Cricket (@BCBtigers) September 12, 2024
బంగ్లాదేశ్ తరపున 17 అంతర్జాతీయ టీ20ల్లో షోరిఫుల్ ఆడాడు. 49 ఫస్ట్ క్లాస్ గేమ్స్ లో 41.47 సగటుతో అతను 2862 రన్స్ చేశాడు. వాటిల్లో నాలుగు సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి బంగ్లా, భారత్ మధ్య చెన్నైలో టెస్టు సిరీస్ ప్రారంభంకానున్నది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనున్నది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనున్నది. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఆ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాయి. బంగ్లాదేశ్ నాలుగవ స్థానంలో ఉన్నది.
బంగ్లా జట్టు
జన్ముల్ హుస్సేన్ షాంతో, షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహిమ్(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, లింటన్ దాస్, మెహిదీ హసన్ మీర్జా, జకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్,మహమదుల్ హసన్ జాయ్, నయిమ్ హసన్, ఖలీద్ అహ్మద్.