గాలె: బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆట ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 177/తో ఆట ఆరంభించిన బంగ్లా.. 285/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసిన కెప్టెన్ నజ్ముల్ హోసేన్ శాంతో (129 నాటౌట్) సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించాడు.
ముష్ఫీకర్ రహీమ్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 295 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 72 రన్స్ చేసింది. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఏంజెలొ మాథ్యూస్.. తన చివరి ఇన్నింగ్స్‌లో 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.