కాన్పూర్: కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(Ind Vs Ban) మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 74 రన్స్ చేసింది. శాంతో 28, మొమినుల్ 17 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీసుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన ఇండియా .. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. బంగ్లా ఓపెనర్ జాకిర్ ఆరంభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భారత బౌలర్ల ధాటికి అతని పరుగులు చేయలేకపోయాడు. జాకిర్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ ఇస్లామ్ 24 రన్స్ చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం కాన్పూర్‌లో వర్షం పడుతోంది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు.
Lunch on the opening day of the Kanpur Test 🍱
Bangladesh move to 74/2 after 26 overs.
Stay tuned for the afternoon session ⏳
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Jocxs8Ld9p
— BCCI (@BCCI) September 27, 2024