రెండో వన్డేలో బంగ్లా విజయం
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తొలి వన్డేలో ఓడినా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటింది. కివీస్‌ను ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చిత్తుచేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట బంగ్లా బౌలర్లు పర్యాటక జట్టును 48.4 ఓవర్లలో 198 పరుగులకే కట్టడిచేశారు.
ఢాకా : సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తొలి వన్డేలో ఓడినా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటింది. కివీస్‌ను ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చిత్తుచేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట బంగ్లా బౌలర్లు పర్యాటక జట్టును 48.4 ఓవర్లలో 198 పరుగులకే కట్టడిచేశారు. నహిద్ రాణా (5/32) తన కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా షోరిఫుల్ ఇస్లాం (2/32) రాణించాడు.
కివీస్ తరఫున నిక్ కెల్లీ (83) మినహా మిగిలినవారిలో ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. స్వల్ప ఛేదనను ఆతిథ్య జట్టు 35.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. తాంజిద్హసన్ తమిమ్ (76), నజ్ముల్ హోసేన్ శాంతో (50), తౌహిద్ హృదయ్ (30 నాటౌట్) ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే ఈనెల 23న చత్తోగ్రమ్లో జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

