కొత్తపల్లి, ఫిబ్రవరి 19: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన జూడో క్రీడకు ఆదరణ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర జూడో సంఘం చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లో రాష్ట్ర జూడో సంఘం కార్యవర్గ సమావేశంతో పాటు నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి.
ఈ సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలో జూడో క్రీడాకారులకు కొదువలేదని, భవిష్యత్లో ఒలింపిక్ స్థాయికి ఎదగాలన్నారు. 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ జూడో క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.