Ball Of The Century : క్రికెట్లో కొందరు బౌలర్లు నమ్మశక్యంకాని బంతులతో వార్తల్లో నిలుస్తుంటారు. స్పిన్ దిగ్గజం దివంగత షేన్ వార్న్(Shane Warne) తన కెరీర్లో ఎన్నోసార్లు అద్భుతమైన డెలివరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టించారు. 1993లో ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్‌ను వార్న్ లైఫ్ టైమ్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. తాజాగా ఒక లెగ్ స్పిన్నర్ అచ్చం అదే చేశాడు.
కువైట్ జెర్సీ వేసుకున్న ఆ స్పిన్నర్ .. మురళీధరన్(Muttiah Muralidharan), భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్(Harbhajan Singh) బౌలింగ్ యాక్షన్‌ను పిస్తూ బంతిని సంధించాడు. ఫుల్ టాస్ పడిన ఆ బంతి ఆమాంత టర్న్ అయి వికెట్లను గిరాటేసింది.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 12, 2024
దాంతో, బ్యాటర్ ఒక్క క్షణం అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. తన కండ్లను తానే నమ్మలేకపోయినట్టు ముఖం పెట్టి పెవిలియన్ బాట పట్టాడు. ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. బాల్ ఆఫ్ ది సెంచరీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
యాషెస్ సిరీస్‌తో 1993లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్న్ ఇంగ్లండ్‌పై సంచలన ప్రదర్శన చేశాడు. ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో జరిగిన టెస్టుల్ మైక్ గాటింగ్‌ను సూపర్ బంతితో బౌల్డ్ చేశాడు. బంతి గింగిరాలు తిరుగుతూ అనూహ్యంగా ఆఫ్‌సైడ్ టర్న్ అయ్యి వికెట్లకు తాకింది. ఒక్క క్షణం గాటింగ్‌కు ఏమీ అర్థం కాలేదు. అంపైర్‌తో పాటు మైదానంలోని ప్రేక్షకులంతా వార్న్ ఏం డెలివరీ వేశాడురా అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.