Educated Rikshawala : తన రిక్షాలో ప్రయాణిస్తున్న బ్రిటన్ టూరిస్టులకు ఆంగ్లంలో మాట్లాడుతూ గైడ్ చేస్తున్న రిక్షా డ్రైవర్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఢిల్లీలో ప్రముఖ ప్రదేశాల గురించి ఈ వీడియోలో రిక్షా డ్రైవర్ విదేశీ టూరిస్టులకు వివరిస్తుండటం కనిపిస్తుంది.
జామా మసీద్, ఆసియాలో అతిపెద్ద స్పైసెస్ మార్కెట్‌ను చూసేందుకు విదేశీ టూరిస్టులు తన రిక్షా ఎక్కారని ఓ ఎక్స్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. దారిలో ఇరుకు వీధుల్లో ఫొటోలు తీసుకోవాలని, షాపింగ్ చేయాలని అనుకుంటే తనకు చెప్పాలని విదేశీ టూరిస్టులను రిక్షా డ్రైవర్ అడగడం ఈ క్లిప్‌లో చూడొచ్చు.
Educated Rikshawala 🔥pic.twitter.com/PjFBKBSKx5
— Dhruv Tripathi (@Dhruv_tr108) February 11, 2024
ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఇప్పటివరకూ 11 వేలకు పైగా వ్యూస్ లభించాయి. రిక్షా డ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడే నైపుణ్యాలతో పాటు విదేశీ పర్యాటకులకు మెరుగ్గా గైడ్ చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :
Health Tips | దవాఖానలో చేరారా.. అయితే ఇవి మీ దరిచేరినట్టే!