న్యూఢిల్లీ : సంక్షోభంలో చిక్కుకున్న భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి మేటి ఆటగాడు బైచుంగ్ భూటియా బరిలో దిగాడు. భూటియా రానున్న ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి చివరిరోజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశాడు.
సమాఖ్య ఎన్నికలు సకాలంలో నిర్వహించనందుకు ఫిఫా భారత్ ఫుట్బాల్ సంఘంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భూటియాతోపాటు మరో ఏడుగురు బరిలో ఉన్నారు. వారిలో ఒక మహిళా అభ్యర్థికూడా పోటీలో ఉండడం విశేషం.