వడోదర : సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందే వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో దూరమవగా మొదటి వన్డే అనంతరం ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా పక్కటెముకల గాయం తో సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
సుందర్ స్థానంలో ఢిల్లీ బ్యాటర్ అయుశ్ బదోనీకి చోటు కల్పించింది. వన్డే జట్టులో చోటు దక్కడం బదోనీకి ఇదే ప్రథమం.