Badminton | బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్.. రెండో రౌండ్‌కే ముగిసిన భారత పోరాటం
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత పోరాటం రెండో రౌండ్‌కే ముగిసింది. భారీ ఆశలతో ఈ టోర్నీ బరిలో నిలిచిన 15 మంది భారత షట్లర్లు రెండో రౌండ్ కూడా దాటలేక చతికిలపడ్డారు. అగ్రశ్రేణి ఆటగాళ్లంతా విఫలమైనా తొలి రౌండ్లో హోరాహోరీగా పోరాడి రెండో రౌండ్ చేరిన పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు.
Badminton | నింగ్బో: ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత పోరాటం రెండో రౌండ్‌కే ముగిసింది. భారీ ఆశలతో ఈ టోర్నీ బరిలో నిలిచిన 15 మంది భారత షట్లర్లు రెండో రౌండ్ కూడా దాటలేక చతికిలపడ్డారు. అగ్రశ్రేణి ఆటగాళ్లంతా విఫలమైనా తొలి రౌండ్లో హోరాహోరీగా పోరాడి రెండో రౌండ్ చేరిన పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్‌లో సింధు 18-21, 21-13, 17-21 తేడాతో ఆరోసీడ్ హన్ యూయి చేతిలో చిత్తైంది.
తొలి సెట్లో ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చినా సింధుకి నిరాశ తప్పలేదు. రెండో సెట్లో పుంజుకున్నా నిర్ణయాత్మక మూడో సెట్లో చైనా అమ్మాయి దూకుడు పెంచడంతో సింధు కథ ముగిసింది. హన్ యూయితో ఆడిన ఆరు మ్యాచ్‌లలో సింధుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ ప్రణయ్.. 18-21, 11-21 తేడాతో అన్‌సీడెడ్ తైవాన్ ఆటగాడు చున్ యి లిన్ చేతిలో పరాభవం పాలయ్యాడు. 43 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రణయ్ ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయాడు. మహిళల డబుల్స్‌లో భారత ద్వయం తనీషా క్రాస్టో- అశ్విని పొన్నప్ప 17-21, 12-21 తేడాతో జపాన్ జోడీ నమి మత్సుయమ – చిహారు చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

