IND vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న డే-నైట్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ను ప్రారంభించిన టీమిండియాకు ఆస్ట్రేలియా బౌలర్లు వరుస షాక్ ఇచ్చారు. మ్యాచ్‌లో ఇద్దరు ఓపెన్లు ఔట్ అయ్యారు. 42 పరుగుల వద్ద యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను బోలాండ్ అవుట్ చేశాడు. జైస్వాల్ 31 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగుల భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. కేవలం ఏడు పరుగులు చేసి.. పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో పట్టు సాధించాలంటే టీమిండియా తప్పనిసరిగా వికెట్ నష్టపోకుండా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (17), విరాట్ (5) క్రీజులో ఉండగా.. భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రసుతం టీమిండియా 100 పరుగులు వెనుకపడి ఉన్నది. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్ల పడగొట్టారు. ఆస్ట్రేలియా 86 పరుగుల వద్ద శనివారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. అదనంగా మరో 251 పరుగులు జోడించి తొమ్మిది వికెట్లను కోల్పోయింది.