Babar Azam : పాకిస్థాన్ (Pakistan) స్టార్ బ్యాటర్ (Star batter) బాబర్ ఆజమ్ (Babar Azam) ఖాతాలో మరో రికార్డు చేరింది. అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా (South Africa) మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా (Hashim Amla) గతంలో నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో 6 వేల పరుగులు చేయడానికి ఆమ్లా 123 ఇన్నింగ్స్ ఆడగా.. బాబర్ కూడా 123 ఇన్నింగ్స్‌లోనే 6 వేల పరుగులు చేశాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ట్రై సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో బాబర్ ఈ రికార్డు నెలకొల్పాడు.
ఆమ్లా, బాబర్‌ల తర్వాత ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేశాడు. ఈ మైలురాయిని అందుకునేందుకు కోహ్లీ 136 ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో బాబర్, ఆమ్లా, విరాట్ తర్వాత స్థానాల్లో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విలియమ్సన్, వార్నర్ ఇద్దరూ 6 వేల పరుగుల మైలురాయి దాటడానికి 139 ఇన్నింగ్స్ చొప్పున ఆడారు.
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్థాన్ ట్రై సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్ లో జరుగుతాయి. ఆ టోర్నీలో ఫిబ్రవరి 20 న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
BCCI New Rules | గౌతమ్ గంభీర్‌కు షాక్..! హెడ్‌కోచ్ కూడా బీసీసీఐ కొత్త రూల్స్‌ను పాటించాల్సిందే..!