దుబాయ్: పాకిస్థాన్ వేదికగా జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి చెందిన ప్రైజ్‌మనీ(Champions Trophy Prize Money) వివరాలను ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 6.9 (60 కోట్లు)మిలియన్ డాలర్లు. అయితే విజేతకు 2.24 డాలర్ల(సుమారు 20 కోట్లు) ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే, ఈ యేడు ఇవ్వనున్న ప్రైజ్‌మనీ సుమారు 53 శాతం అధికంగా ఉన్నట్లు ఐసీసీ పేర్కొన్నది. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్లకు కనీసం లక్షా 25 వేల డాలర్లు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే.
టర్నీలో రన్నరప్‌కు 1.12(9.72 కోట్లు) మిలియన్ల డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. సెమీస్‌లో ఓడిన ప్రతి జట్టుకు.. కనీసం 5 లక్షల 60 వేల డాలర్ల(4.86 కోట్లు) ప్రైజ్‌మనీ అందుతుంది. చాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కీలకంకానున్నది. ప్రతి గ్రూప్ స్టేజ్‌లో గెలిచే జట్టుకు 34 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఇక టోర్నీలో అయిదు, ఆరవ స్థానాల్లో నిలిచే జట్లకు 3.50 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ అందనున్నది. ఏడు, ఎనిమిదవ స్థానాల్లో ఉన్న వారికి లక్షా 40 వేల డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తారు.
1996లో తర్వాత తొలిసారి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఈవెంట్ జరుగుతోంది. 2025 ఎడిషన్‌లో మొత్తం 8 జట్లు.. రెండు గ్రూపులుగా తలపడనున్నాయి. ప్రతి గ్రూపు నుంచి టాప్ రెండు జట్లు సెమీస్‌కు ప్రవేశిస్తాయి. ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరగనున్న విషయం తెలిసిందే.
A substantial prize pot revealed for the upcoming #ChampionsTrophy 👀https://t.co/i8GlkkMV00
— ICC (@ICC) February 14, 2025