Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) ఎమర్జింగ్ ఆసియా కప్(Emerging Asia Cup 2023) చాంపియన్‌గా నిలిచిన ‘ఏ’ జట్టుకు చురకలు అంటించాడు. భారత(India) ‘ఏ’ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాక్ ఏ జట్టు ఆటగాళ్ల ప్రవర్తనను బాబార్ తప్పుపట్టాడు. మైదానంలో ఇతరులను దూషించడం కంటే ఆటను మెరుగుపర్చుకోవాలని హితబోధ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటన(Srilanka Tour)లో ఉన్న బాబర్ బృందం ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించింది.
మ్యాచ్ అనంతరం విజేతలతో బాబర్ అండ్ కో మాట్లాడారు. ‘ఇలాంటి విజయాలతో పొంగిపోకండి. ఇది ఆరంభం మాత్రమే. మైదానంలో ప్రత్యర్థులతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఓసారి గమనించుకోండి’ అని పాక్ ఏ జట్టును బాబర్ సుతిమెత్తగా హెచ్చరించాడు.
శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం(pallekele stadium)లో నిన్న జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో పాక్ ‘ఏ’ జట్టు 128 పరుగుల తేడాతో భారత జట్టుపై భారీ విజయం సాధించింది. దాంతో, వరుసగా రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. అయితే.. మ్యాచ్ సమయంలో పాక్ బౌలర్ సూఫియన్ మకీం(sufiyan muqeem) భారత ఆటగాళ్లను దుర్బాషలాడుతూ కెమెరా కంటికి చిక్కాడు. అందుని అలాంటి చర్యలు మానుకోవాలని బాబర్ ఏ జట్టు ఆటగాళ్లకు సూచించాడు.
వికెట్ తీసిన ఆనందంలో పాకిస్థాన్ ‘ఏ’ జట్టు ఆటగాళ్లు
టాస్ గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్(Yash Dhull) పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాక్ ఓపెనర్లు సయిం అయూబ్(59), షహబ్జద ఫర్హాన్(65) రెచ్చిపోయారు. వీళ్లు ఔటయ్యాక వచ్చిన తయ్యబ్ తహిర్(108 : 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాక్ 352 పరుగులు కొట్టింది.
అభిషేక్ శర్మ(61), సాయి సుదర్శన్(29)
భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ(61) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ యశ్ ధుల్(39), సాయి సుదర్శన్(29) విఫలమయ్యారు. పాక్ బౌలర్ సూఫియన్ మకీం 3 కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. టీమిండియా యువరాజ్‌సింగ్ దడియా(5)ను మహమ్మద్ వసీం జూనియర్ బౌల్డ్ చేయడంతో పాక్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.