Kylian Mbappe | వరల్డ్ కప్ హీరో ఎంబాపేకు బంపర్ ఆఫర్.. 2వేల కోట్లు ఇస్తామంటున్న సౌదీ క్లబ్..!
Kylian Mbappe : ఫ్రాన్స్ వరల్డ్ కప్ హీరో కైలియన్ ఎంబాపే(Kylian Mbappe,)కు బంపర్ ఆఫర్ వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(All Hilal) క్లబ్ అతడికి రికార్డు స్థాయిలో డబ్బులు ఇస్తామని ప్రకటించింది. తమ క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంటే 332 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 2వేల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. అంత ధరనా? అని నోరెళ్లబెడుతున్నారా...
Kylian Mbappe : ఫ్రాన్స్ వరల్డ్ కప్ హీరో కైలియన్ ఎంబాపే(Kylian Mbappe,)కు బంపర్ ఆఫర్ వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(All Hilal) క్లబ్ అతడికి రికార్డు స్థాయిలో డబ్బులు ఇస్తామని ప్రకటించింది. తమ క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంటే 332 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 2వేల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. అంత ధరనా? అని నోరెళ్లబెడుతున్నారా..! ఫ్రాన్స్ యువ సంచలనం ప్రపంచలోని అత్యంత ఖరీదైన ఆటగాడు.
అవును.. ఎంబాపే ప్రస్తుత మార్కెట్ ధర ఎంతో తెలుసా..? 94.8 మిలియన్ యూరో(దాదాపు రూ.800 కోట్లు )ల నుంచి 157.9 మిలియన్ యూరో(దాదాపు రూ. 1000 కోట్లు)లు. మరి, అంత రేంజ్ ఉన్న అతడికి సౌదీ క్లబ్ రెండు వేల కోట్లు ఆఫర్ చేయడం సమంజసమే అనిపిస్తోంది. ఒకవేళ ఎంబాపే ఈ డీల్‌కు అంగీకరిస్తే అత్యంత ఎక్కువ ధర పలికిన ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
కిలియన్ ఎంబాపే

ఎంబాపే ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్(PSG)కు ఆడుతున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్టు ముగియనుంది. దాంతో, వచ్చే సీజన్లో క్లబ్‌ను వీడుతున్నట్టు ఇప్పటికే అతను యాజమాన్యానికి చెప్పేశాడు. అందుకని ఈ స్టార్ ఆటగాడిని సొంతం చేసుకునేందుకు పలు క్లబ్స్ పోటీ పడుతున్నాయి. అయితే.. అల్ హిలాల్ క్లబ్ రేసులో అందరికంటే ముందు ఉన్నట్టు తెలుస్తోంది.
2022 వరల్డ్ కప్ ఫైనల్లోఎంబాపే, లియోనల్ మెస్సీ

ఫ్రాన్స్ జట్టు 2018లో వరల్డ్ కప్(World Cup 2018) గెలవడంలో ఎంబాపే కీలక పాత్ర పోషించాడు. నిరుడు ఖతర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లోనూ అతను జట్టుకు ట్రోఫీ అందించినంత పని చేశాడు. అర్జెంటీనా (Arjentina)తో హోరాహోరీ పోరులో ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్(Hattrik Goals) కొట్టాడు. దాంతో, రెండుసార్లు స్కోర్లు సమం అయ్యాయి. అయితే.. షూటౌట్లో మాత్రం ఫ్రాన్స్ గట్టెక్కలేకపోయింది. 4-2తో లియోనల్ మెస్సీ(Lionel Messi) జట్టు మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
Football Commentator | లైవ్ వీడియోలో పగలబడి నవ్వుతూ.. హఠాత్తుగా కుప్పకూలిన ఫుట్‌బాల్ కామెంటేటర్
Ravichandran Ashwin | భజ్జీ రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా ఘనత
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

