Azam Siddique | బాబర్ ఆకలితో అలమటించాడు.. పాక్ కెప్టెన్ బాల్యం గురించి షాకింగ్ విషయాలు చెప్పిన తండ్రి
పాక్ కెప్టెన్ బాబర్ సక్సెస్ వెనుక ఎంతో కష్టం దాగి ఉందని అతడి తండ్రి ఆజాం సిద్దిఖీ తాజాగా ఒక వీడియోలో చెప్పాడు. బాబర్ జీవితంలో ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయని వెల్లడించాడు.
Azam Siddique : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అలాంటిది అతని జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయనే సంగతి చాలామందికి తెలియదు. మనందరికి అత్యుత్తమ బ్యాటర్‌గా తెలిసిన బాబర్ జీవితంలో ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయి. అతడి సక్సెస్ వెనుక ఎంతో కష్టం దాగి ఉందని అతడి తండ్రి ఆజాం సిద్దిఖీ తాజాగా ఒక వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘అప్పట్లో పేదరికం కారణంగా మా ఇంట్లో ఒకరికి మాత్రమే తినడానికి ఆహారం ఉండేది. ఒకవేళ నేను ఆరోజు తింటే బాబర్ రోజంతా పస్తులు ఉండాల్సి వచ్చేది. అంతేకాదు నాకు స్కిన్ ఎలర్జీ ఉంది. దాంతో, బాబర్ ప్రాక్టీస్ చేస్తుంటే నేను స్టేడియం బయటే ఉండేవాడిని’ అని సిద్దిఖీ తెలిపాడు.
అంతేకాదు.. ‘పప్పా.. నువ్వు తిన్నావా? అని బాబర్ అడిగితే.. హా.. నేను తిన్నాను అని చెప్పేవాడిని. అతడిని తిన్నావా? అని అడిగితే.. తిన్నాను అని సమాధానం చెప్పేవాడు. అలా ఒకరితో ఒకరం అబద్ధాలు ఆడేవాళ్లం’ అని సిద్దిఖీ వెల్లడించాడు. ఈ వీడియోలో బాబర్ తనకు షూ కొనిచ్చేంత స్తోమత తన తండ్రికి లేదని తెలిపాడు.
ఐసీసీ అవార్డులు వాళ్లకు అంకింతం
బాబర్‌కు మొదటి నుంచి తండ్రి సిద్దిఖీ మద్దతు చాలా ఉంది. తండ్రి సపోర్టులో బాబర్ తనకు ఇష్టమైన ఆటలో రాణించడం మొదలుపెట్టాడు. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. నిలకడగా ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్లో తన ముద్ర వేస్తున్నాడు. పోయిన ఏడాది బాబర్ 9 వన్డే మ్యాచుల్లో 90.77 స్ట్రయిక్ రేటుతో 679 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన కుమారుడు గెలిచిన ఐసీసీ అవార్డులను తమ కలను నిజం చేసుకునేందుకు కిట్ బ్యాగులతో గ్రౌండ్‌కు వెళ్లే పిల్లలకు సిద్ధిఖీ అంకితం ఇచ్చాడు. ఈమధ్యే బాబర్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 (గ్యారీ సోబర్స్ ట్రోఫీ) అవార్డులు గెలుచుకున్నాడు.
This is what success looks like! Babar Azam ❤️pic.twitter.com/gcAeOU6iuc
— Farid Khan (@_FaridKhan) January 27, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

