ఎడ్జ్‌బాస్టన్ : లార్డ్స్ టెస్టులో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్లో కలకలం సృష్టిస్తున్న అంశాలపై ఇన్నాళ్లూ మౌనం వహించిన ఆ జట్టు టెస్టు సారథి బాబర్ ఆజమ్ ఎట్టకేలకు నోరువిప్పాడు. ఆ మ్యాచ్ తర్వాత జట్టులో ఏడుగురు సభ్యులను, కోచ్‌ను తప్పించడంపై ముందుగా తనకూ సమాచారం లేదన్నాడు. మూడో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబర్ మాట్లాడుతూ.. ‘ఆ విషయం నేనూ వార్తల్లో వస్తేనే తెలుసుకున్నా.
ఈ నిర్ణయం పీసీబీది. దీనిపై వాళ్లు స్పందిస్తేనే బాగుంటుంది’ అని అన్నాడు. క్రికెటర్లు, కోచ్‌ను ఇంటికి పంపడంతో ఆ ప్రభావం జట్టుపై పడుతుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇదేం కష్టం కాదు గానీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అని చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపిస్తున్న వేళ జట్టులో పీసీబీ అంతర్గత విచారణ చేపట్టగా దానిపైన మీ స్పందనేంటి? అని అడగ్గా ‘లేదు. నాకు దాని గురించీ సమాచారం లేదు’ అని సమాధానం దాటవేయడం గమనార్హం.