Hong Kong Open : హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత షట్లర్లు జోరు చూపిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి (Ayush Shetty) సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఉత్కంఠగా సాగిన పోరులో అతడు ఏకంగా తొమ్మిదో సీడ్‌కు షాకిచ్చాడు. కొడాయ్ నరొకా(Kodai Naraoka)ను చిత్తుగా ఓడించాడు. మరో పోరులో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌ను లక్ష్యసేన్ ఓడించారు. క్వార్టర్స్‌లో ఆయుశ్తో సేన్ తలపడనున్నాడు.
జూనియర్ స్థాయిలో సంచలన విజయాలతో అబ్బురపరిచిన ఆయుశ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్‌తో చెలరేగిపోతున్నాడు. అటాకింగ్ గేమ్‌తో కొడాయ్ నరొకాను మట్టికరిపించిన అతడు తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. తొలి సెట్‌ను 21-19తో గెలుపొందిన ఆయుశ్ రెండో సెట్లో మాత్రం తడబడ్డాడు. దాంతో, నొరోకా 21-12తో పైచేయి సాధించాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో జపాన్ స్టార్‌కు ఆయుశ్ చుక్కలు చూపించి 21-14తో మ్యాచ్‌ను ముగించాడు.
Upset in Hong Kong!🥁💪
One of the biggest upsets of the day! 🇮🇳 Ayush Shetty stuns 5th seed Kodai Naraoka (JPN) 21-19, 12-21, 21-14 in a 72-min thriller to storm into the quarterfinals🔥🏸 #Badminton #TeamIndia pic.twitter.com/Agy6oz1kCs— BAI Media (@BAI_Media) September 11, 2025
భారత షట్లర్ల మధ్య గురువారం జరిగిన మరో పోరులో ప్రణయ్‌ను 15-21, 21-18, 21-10తో లక్ష్య సేన్ ఓడించాడు. తద్వారా ఆరునెలలో మొదటిసారి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడీ యంగ్‌స్టర్. తదుపరి మ్యాచ్‌లో ఆయుశ్‌ను సేన్ ఢీకొననున్నాడు. దాంతో.. భారత్ నుంచి ఒకరు సెమీఫైనల్ చేరడం ఖాయమైంది. ఈమధ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రెండో కాంస్యంతో చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం కూడా దుమ్మురేపింది. ప్రత్యర్ధిని చిత్తుగా ఓడించి అలవోకగా క్వార్టర్ ఫైనల్ చేరింది. సెమీస్ బెర్తు కోసం ఈ జోడీ జునైదీ అరిఫ్ – రాయ్ కింగ్ యాప్ (మలేషియా) జంటను ఢీ కొట్టనుంది.
“It’s redemption for both of us to come here exactly a year later (after Paris Olympics) and to win the World Championship medal and be on the podium!”
– Satwiksairaj Rankiredd and Chirag Shetty 🥉🥉
Pic Credit: @badmintonphoto pic.twitter.com/bRl1lNYs20
— BAI Media (@BAI_Media) September 1, 2025