Thomas Cup | అదరగొట్టిన ఆయుశ్, సాత్విక్ -చిరాగ్ జోడీ.. కెనడాపై భారత్‌కు ఆధిక్యం..!
Thomas Cup : ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. ఆయుశ్ శెట్టి (Ayush Shetty) దుమ్ము రేపగా.. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం మెరిసింది.
Thomas Cup : ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ రన్నరప్ ఆయుశ్ శెట్టి (Ayush Shetty) దుమ్ము రేపగా.. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం మెరిసింది. శుక్రవారం జరిగిన గ్రూప్ దశ టై మ్యాచ్‌లో లక్ష్య సేన్(Lakshya Sen) ఓటమి పాలైనప్పటికీ ఆయుశ్, సాత్విక్ – చిరాగ్ విజయంతో కెనడాపై 4-1తో భారత్ అధిక్యం కనబరిచింది.
ఫేవరెట్‌గా థామస్ కప్‌లో అడుగుపెట్టిన లక్ష్య సేన్‌కు అనూహ్యంగా ఓటమి ఎదురైంది. వరల్డ్ నంబర్ 13వ ఆటగాడు విక్టర్ లాయ్(కెనడా) చేతిలో సేన్ కంగుతిన్నాడు. తొలి సెట్‌ను 21-18తో గెలిచిన సేన్ అదే దూకుడు కొనసాగించలేకపోయాడు. హోరాహోరీగా సాగిన మూడు సెట్ల పోరులో భారత స్టార్‌ను నిలువరించిన విక్టర్ 18-21, 21-19, 21-10తో గెలుపొందాడు.
India Starts Strong! 🇮🇳🔥
A clinical 4-1 victory for India against Canada to open their Thomas Cup 2026 campaign. pic.twitter.com/eJxIFXSFUQ
— BAI Media (@BAI_Media) April 24, 2026
లక్ష్య సేన్ నిరాశపరిచినా డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి తమ తడాఖా చూపించారు. జొనాథన్ బింగ్ – కెవిన్ లీ ద్వయానికి ముచ్చెమటల పట్టిస్తూ 30 నిమిషాల్లోనే 21-10, 21-11తో మ్యాచ్‌ను ముగించి స్కోర్ (1-1) సమం చేశారు.
ఇటీవలే ముగిసిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆయుశ్ 39 నిమిషాల్లోనే 21-13, 21-17తో బ్రియాన్ యాంగ్‌ను చిత్తు చేశాడు. దాంతో, భారత్ 2-1తో ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం హరిహరన్ హంసకరుణన్ ద్వయం 21-7, 21-15తో అలెగ్జాండర్ లిండెమన్, నైల్ యకరా జంటపై గెలుపొందడంతో కెనడాపై స్పష్టమైన ఆధిక్యం సాధ్యమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

