IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వరుసగా వికెట్లు కోల్పోతోంది. దంచికొడుతున్న ఓపెనర్ ఆయుశ్ మాత్రే (43) సైతం ఔటయ్యాడు. అర్ధ శతకానికి చేరువైన ఈ చిచ్చరపిడుగును తుషార్ దేశ్‌పాండే వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అతడు మరో పెద్ద షాట్ ఆడే క్రమంలో.. మఫాకా చేతికి చిక్కాడు. దాంతో, చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా(0), అశ్విన్(12)లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్.. 68-3.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓకే ఓవర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే(10), యువకెరటం ఉర్విల్ పటేల్(0) ఔటయ్యారు. యుధ్వీర్ సింగ్ వేసిన రెండో ఓవర్లో.. కాన్వే చెత్త షాట్ ఆడి పరాగ్‌కు దొరికిపోయాడు. ఆఖరి బంతికి ఉర్విల్ సైతం అదే తరహా షాట్ ఆడగా.. మఫాకా వెనక్కి పరుగెడుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 12 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Another sparkling innings from Ayush Mhatre ✨
He goes back for 43(20) as Kwena Maphaka takes another excellent catch 👏#CSK 70/4 after 6.3 overs.
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR pic.twitter.com/sZ2c1nk1E7
— IndianPremierLeague (@IPL) May 20, 2025
బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన అశ్విన్(12).. ఓపెనర్ ఆయుష్ మాత్రే(43)కు అండగా చెన్నై నిలిచాడు. యుధ్వీర్ ఓవర్లో అశ్విన్ వరుసగా 4, 6 బాదగా స్కోర్ 30కి చేరింది. ఐదో బంతిని మాత్రే లాంగాన్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని దేశ్‌పాండే విడదీశాడు.