INDU19 vs NZU19 : పురుషుల అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా దూసుకెళ్తోంది. వర్ష కారణంగా 37 ఓవర్లకు కుదించిన పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా జయభేరి మోగించింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం స్వల్ప లక్ష్యాన్ని 13.3 ఓవర్లలోనే ఛేదించి సూపర్ సిక్స్‌కు దూసుకెళ్లింది. అంబ్రిష్(4-29), హెనిల్ పటేల్(3-23)లు ప్రత్యర్థిని కట్టడి చేయగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే(53), వైభవ్ సూర్యవంశీ(40)లు ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డారు. వీరి విధ్వంసంతో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసి తర్వాతి దశకు అర్హత సాధించింది.
అండర్ -19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు అద్భుతంగా రాణిస్తుండడంతో ఫేవరెట్ టీమిండియా సూపర్ సిక్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా శనివారం ఆర్ఎస్ అంబ్రిష్(4-29), హెనిల్ పటేల్(3-23)లు న్యూజిలాండ్‌పై నిప్పులు చెరిగారు. పవర్ ప్లేలోనే కివీస్ టాపార్డర్‌ను కూల్చిన ఈ ద్వయం.. ఆ తర్వాత కూడా పోటీపడి వికెట్లు తీయగా ప్రత్యర్థి135కే ఆలౌటైంది. ఆ జట్టులో సెల్పిన్ సంజయ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Ayush Mhatre smashed 53 in 27 balls in the U19 World Cup. pic.twitter.com/slylHiJ5Bj
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2026
Innings Break!
On the back of 4⃣/2⃣9⃣ from Ambrish R.S, India U19 restrict New Zealand U19 to 135 🙌
Over to our batters ⌛️
Scorecard ▶️ https://t.co/tsYh3Rm1eV #U19WorldCup pic.twitter.com/1H2Q7RDNGf
— BCCI (@BCCI) January 24, 2026
అనంతరం వర్షం అంతరాయంతో భారత లక్ష్యాన్ని 130గా కుదించారు. స్వల్ప ఛేదనలో ఓపెనర్ అరోన్ జార్జ్(7) విఫలమైనా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే(53 : 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వైభవ్ సూర్యవంశీ(40)లు చితక్కొట్టారు. షార్ట్‌పిచ్ బంతుల్ని అలవోకగా ఎదుర్కొన్న మాత్రే.. అర్ధ శతకంతో జట్టు విజయానికి బాటలు వేశాడు. అతడు ఔటయ్యాక విహాన్ మల్హోత్రా(17 నాటౌట్), వేదాంత్ త్రివేది(13 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా లాంఛనం పూర్తి చేశారు. వీరిద్దరూ అజేయంగా నిలవగా.. 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన అంబ్రిష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
For his match-winning spell of 4⃣/2⃣9⃣, Ambrish R.S. is named the Player of the Match as India U19 win by 7⃣ wickets (DLS method) against New Zealand U19 🙌
Scorecard ▶️ https://t.co/tsYh3Rm1eV #U19WorldCup pic.twitter.com/0GqzugTIx0
— BCCI (@BCCI) January 24, 2026