మెల్బోర్న్: టీమ్ఇండియాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతినిచ్చారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన వార్నర్ పొట్టి సిరీస్ ఆడకుండానే స్వదేశానికి వెళ్లనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది. అతడి స్థానంలో ఆరోన్ హార్డీ జట్టుతో చేరాడు. వరల్డ్‌కప్ ఆడిన జట్టు నుంచి ఏడుగురు ప్లేయర్లు ఈ సిరీస్‌లో పాల్గొననుండగా.. మాథ్యూ వేడ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ కోసం సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమ్ఇండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా జట్టు: వేడ్ (కెప్టెన్), హార్డీ, బెహ్రాన్‌డార్ఫ్, అబాట్, టిమ్ డేవిడ్, ఎలీస్, హెడ్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, షార్ట్, స్మిత్, స్టొయినిస్, రిచర్డ్సన్, జాంపా.