సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్-500 టోర్నీలో భారత షట్లర్ల టైటిల్ వేట క్వార్టర్స్ పోరుతోనే ఆగిపోయింది. శుక్రవారం జరిగిన పురుషుల, మహిళల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మన షట్లర్లు ఓడటంతో భారత్‌కు నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్.. 21-19, 21-13తో నరొక (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. సమీర్ వర్మను 12-21, 13-21తో లిన్ చున్ యీ (చైనీస్ తైఫీ) బోల్తొ కొట్టించాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 17-21, 12-21 తో పై యు-పొ (చైనీస్ తైపీ)కు తలవంచగా మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్-సిక్కిరెడ్డి జోడీ 12-21, 12-21తో జెన్ బంగ్ – వీ యా జిన్ (చైనా) చేతిలో ఓడింది.