INDW vs AUSW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో వరుస రెండు విజయాలతో సెమీస్ రేసులో నిలిచిన భారత జట్టు (Team India) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీలు కొట్టిన ఆస్ట్రేలియా(Australia)ను టీమిండియా ఢీ కొడుతోంది. సెమీస్ అవకాశాల్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచినతహ్లియా మెక్‌గ్రాత్ బ్యాటింగ్ తీసుకుంది.
వరల్డ్ కప్ టోర్నీలో కొరకరాని కొయ్యాలా మారిని ఆసీస్‌ను ఓడించాలంటే.. భారత అమ్మాయిలు అద్భుతం చేయాల్సిందే. గాయాలతో సతమతం అవుతున్న కంగారూలను దెబ్బ కొట్టడానికి ఇదే మంచి చాన్స్ కూడా. . 2018 తర్వాత ఆసీస్ వరల్డ్ కప్‌లో రెండంటే రెండు మ్యాచుల్లో ఓడింది. అది కూడా భారత జట్టు చేతిలోనే కావడం గమనార్హం.
భారత జట్టు : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, శ్రేయాంక పాటిల్, అశా శోభన, రేణుకా సింగ్
ఆస్ట్రేలియా జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), గ్రేస్ హ్యారీస్, అలీసా పెర్రీ, అష్ గార్డ్నర్, ఫొబే లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్(కెప్టెన్), జార్జియా వరేహం, అనాబెల్ సథర్లాండ్, సోఫీ మొలినెక్స్, మేగన్ షట్, డార్సీ బ్రౌన్.