AUSW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan)తో తలపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. బలైమన ఆసీస్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం పాక్ బ్యాటర్లకు శక్తికి మించిన పనే కానుంది.
టీమిండియా చేతిలో ఓటమితో సెమీస్ రేసులో వెనుకబడిన పాక్‌కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. విజయం సాధిస్తేనే ముందుడు.. లేదంటే ఇంటికే. కీలకమైన ఈ గేమ్‌కు ఆ జట్టు సారథి ఫాతిమా సనా (Fatima Sana) దూరమైంది. దాంతో, వైస్ కెప్టెన్ మునీబా అలీ (Muneeba Ali) పగ్గాలు చేపట్టింది.
Australia will chase under the lights in Dubai today ☝
Ball-by-ball updates 👉 https://t.co/9NA1RcHV3I #T20WorldCup #AUSvPAK pic.twitter.com/3YcUgysVAE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2024
పాకిస్థాన్ జట్టు : మునీబా అలీ(కెప్టెన్, వికెట్ కీపర్), సిద్రా అమిన్, నిదా దార్, సదాఫ్ షమాస్, అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఒమైమా సొహైల్, టుబా హసన్, నష్రా సంధు, సదియా ఇక్బాల్, సైదా అరూబ్ షా.
ఆస్ట్రేలియా జట్టు : అలీసా హేలీ(కెప్టెన్, వికెట్ కీపర్), బేత్ మూనీ, అలీసా పెర్రీ, అష్ గార్డ్నర్, ఫొబే లిచ్‌ఫీల్డ్, జార్జియా వరేహం, తహ్లియా మెక్‌గ్రాత్, అన్నాబెల్ సథర్లాండ్, సోఫీ మొలినెక్స్, మేగన్ షట్, తయ్లా వ్లెమింక్.