Singham 3 | బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్, దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty) కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). బ్లాక్ బస్టర్ ‘సింగం’(Singham) ఫ్రాంచైజీకి బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవ్గణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు కమర్షియల్గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది. సింగం అగైన్ (Singham Agian) అంటూ వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను నవంబర్ 01 (శుక్రవారం)న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మూవీలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
This Diwali, the roars will be louder than the ⚡️🌌#SinghamAgain pic.twitter.com/TDYHY5H0Yl
— Ajay Devgn (@ajaydevgn) October 11, 2024