IND vs AUS | భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతానని.. కానీ, తొలుత బ్యాటింగ్ చేయడానికి కూడా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది. ఆస్ట్రేలియా జట్టు మాత్రం పలు మార్పులు చేసింది. ఫిలిప్ స్థానంలో అలెక్స్ కారీ, ఎల్లిస్ స్థానంలో జేవియర్ బార్ట్లెట్ను తుదిజట్టులోకి తీసుకుంది. లాస్ట్ మ్యాచ్ హీరో ఎడమచేతి వాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్‌ను జట్టు నుంచి తప్పించింది. సీనియర్ లెగ్ బ్రేక్ బౌలర్ ఆడమ్ జంపా తిరిగి జట్టులోకి చేరాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ కారీ సైతం తిరిగి వచ్చాడు.
టీమిండియా జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.