పాకిస్థాన్‌కు ఘోర పరాభవం
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. నాలుగు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆసీస్ 360 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
- తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో ఆసీస్ జయభేరి
పెర్త్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. నాలుగు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆసీస్ 360 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఓవర్‌నైట్ స్కోరు 84/2తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కంగారూలు.. 233/5వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఉస్మాన్ ఖవాజా (90; 9 ఫోర్లు), మిషెల్ మార్ష్ (63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. పాక్ బౌలర్లలో షహజాద్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం 450 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 89 పరుగులకే కుప్పకూలింది. సౌద్ షకీల్ (24) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (2), అబ్దుల్లా (2), బాబర్ (14), సర్ఫరాజ్ (4), సల్మాన్ (5), ఫహీమ్ (5) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్న లియాన్ టెస్టు క్రికెట్లో 500 వికెట్ల మార్క్ దాటాడు. మిషెల్ మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

