టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరులో ఆస్ట్రేలియా అలవోకగా విజయం సాధించింది. 17 ఓవర్లలోనే మ్యాచ్ను ఆస్ట్రేలియా ముగించేసింది. మరో 18 బంతులు మిగిలి ఉండగానే.. 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఇక.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 65 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు తీరంవైపు నడిపించాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత షనక బౌలింగ్లో రాజపక్సకు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ ఫించ్ 23 బంతుల్లో 37 పరుగులు చేసి సిల్వా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. స్టీవెన్ స్మిత్ 26 బంతుల్లో 28 పరుగులు చేయగా.. మార్కస్.. 7 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
శ్రీలంక బౌలర్లలో హసరంగ డీసిల్వా 4 ఓవర్లు వేసి 2 వికెట్లను తీశాడు. శ్రీలంక కెప్టెన్ షనక ఒక ఓవర్ వేసి ఒక వికెట్ను తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. తొలుత బ్యాటింగ్ బరిలోకి దిగిన శ్రీలంక.. పరిమిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి.. ఆస్ట్రేలియాకు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
4 ఓవర్లు వేసి 2 కీలక వికెట్లు తీసి కేవలం 12 పరుగులే ఇచ్చిన ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
Two in two for Australia ✌️
— T20 World Cup (@T20WorldCup) October 28, 2021
#T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/Xv8KlB4f0I
David Warner's excellent knock of 65 comes to an end.
— T20 World Cup (@T20WorldCup) October 28, 2021
The Sri Lankan skipper Shanaka gets his prized scalp.
#T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/IHrdRJImMq
🔙 into form like 😃#T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/p0Q8iRzL74
— T20 World Cup (@T20WorldCup) October 28, 2021
A bullish half-century from David Warner 💪
— T20 World Cup (@T20WorldCup) October 28, 2021
#T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/Eyz7GNY99R